మర్కూక్‌ పంపు హౌజ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

మర్కూక్‌ పంపు హౌజ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
x
Markuk Pump House
Highlights

గోదావరి జలాలను అరకిలో మీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 4, ప్యాకేజీ 14లో...

గోదావరి జలాలను అరకిలో మీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా నిర్మించిన మర్కూక్‌ పంపు హౌజ్‌ను సీఎం కేసీఆర్, చినజీయర్‌ స్వామితో కలిసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులోకి నీరు వదల డానికి 6 మోటార్లను 34 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయగా వాటిలో ఒక మోటార్ ను సీఎం ఆన్ చేసారు. దీంతో కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభం అయింది. మరికొద్ది సేపటిలోనే కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు గోదావరి జలాలు చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని సుమారు 26 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అంతే కాదు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యంతో పాటు ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories