ఏకాంతంగా 6 గంటలకు పైగా సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఏకాంతంగా 6 గంటలకు పైగా సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
x
Highlights

అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే...

అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. 9,10వ షెడ్యూల్‌లోని అంశాలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 షెడ్యూల్‌లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్ క్రెడిట్, పోలీసు ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీలు, తదితర అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు.

సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, అధికారులు పరస్పరం చర్చించుకోవాలని ఆదేశించారు. తెలంగాణ సీఎస్‌ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం ఏపీకి రానుంది. అలాగే ఏపీ అధికారుల బృందం కూడా హైదరాబాద్‌లో తెలంగాణ అధికారులతో చర్చించనుంది.

అంతకుముందు సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. జగన్ ప్రతినిధి బృందంతో భోజనం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు ఆరు గంటల పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల్లోని తాగు, సాగు నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జలాల తరలింపుపై చర్చించారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా కృష్ణా-గోదావరి అనుసంధానంతో సహా చేపట్టాల్సిన పథకాలపై నిర్మాణాత్మక, ప్రణాళికల తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజినీర్లు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.

గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి...? ఎలా వినియోగించాలి... ‎? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి...? అనే అంశాలపై తదుపరి జరిగే సమావేశంలో మరింతగా చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జగన్‌తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. సీఎంతో సమావేశం తర్వాత జగన్ అమరావతి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories