జార్జియాలో చిక్కుకున్న తెలంగాణ యువతి

జార్జియాలో చిక్కుకున్న తెలంగాణ యువతి
x
Shivani
Highlights

తెలంగాణకు చెందిన ఓ యువతి జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పెద్ద చదువుల కోసం జార్జియా వెళ్లింది.

తెలంగాణకు చెందిన ఓ యువతి జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పెద్ద చదువుల కోసం జార్జియా వెళ్లింది. అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. శివాణి కాలేజీకి వెల్లే సమయంలో యువతి ఒక్క సారిగా ఆనారోగ్యానికి గురైంది. ఒక్క సారిగా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. అది గమనించిన ఆమె స్నేహితులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెల్లారు. వెంటనే ఆమెను వైద్యులు పరీక్షించి తన మెదడులో రక్తం గడ్డకట్టిందని స్పష్టం చేసారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు తోటి విద్యార్ధులు సమాచారం అందించారు.

కాగా తన తల్లిదండ్రులు హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఆక్కడ ఆమెకు చికిత్స చేయించేందుకు అన్ని ఏర్పాట్ల చేసుకుని, శివాణిని రప్పించేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకూ అన్ని సక్రమంగా జరగగా ఒక్క సారిగా శివాణి ప్రయాణం ఆగిపోయింది. జార్జియా ఎయిర్ పోర్టులో సిబ్బంది శివాణిని అడ్డుకున్నారు. ఆమెను ఇండియాకు పంపించేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న శివాణి తల్లిదండ్రులు తమ కూతురిని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. భారత్ కు ఆమెను పంపించాలని కోరుకుంటున్నారు. శివాణికి తక్షణమే వైద్యం అందించకపోతే తమ కూతురు ప్రాణాలకు ప్రమాదమని వాళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories