పెరుగుతున్న పెళ్లికాని ప్రసాదులు..రాష్ట్రంలో తీవ్రంగా అమ్మాయిల కొరత

పెరుగుతున్న పెళ్లికాని ప్రసాదులు..రాష్ట్రంలో తీవ్రంగా అమ్మాయిల కొరత
x
Highlights

రాష్ట్రంలో అమ్మాయిల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకక అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాల...

రాష్ట్రంలో అమ్మాయిల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకక అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాల వేటలో పడిన యువత లేటు పెళ్లిళ్లు చేసుకోవడం ఒక ఎత్తయితే సమయానికి అన్ని ఉన్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్కుండాపోతుంది. పెళ్ళి కాని ప్రసాద్‌లపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

వెంకటేష్‌ నటించిన మల్లీశ్వరి సినిమా గుర్తుందా, అందులో కథానాయకుడు బ్యాంకులో పని చేస్తుంటాడు. పెళ్లి కాకపోవడంతో కొలీగ్స్‌ అంతా పెళ్లికాని ప్రసాద్‌ అంటూ ఆటపట్టించడం తెలిసిందే. బ్యాంకుకు వచ్చే అమ్మాయిలకు పెళ్లి అయిందో కాలేదో అంటూ కాళ్ల మెట్టెలు చూస్తూంటాడు.

అచ్చం వెంకటేష్‌ పరిస్థితే కొంతమంది యువకులకు ఎదురవుతోంది. 30 ప్లస్‌ వచ్చినా పెళ్లిళ్లు కావడం లేదు. రాష్ట్రంలో ఎక్కువగా రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వీరు సొంతకులంలో చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. దారుణంగా పడిపోతున్న లింగనిష్పత్తినే దీనికి కారణం. ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు కేవలం 928మంది మాత్రమే ఆడ పిల్లలున్నారు. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఆడ పిల్లల కొరత మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు అన్ని కులాల్లో అమ్మాయిల కొరత ఉంది. అమ్మాయిల ఇష్టాల్లో మార్పు వచ్చింది. దీంతో పెళ్లికాని అబ్బాయిలు పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితిలో అబ్బాయిలు కాంప్రమైజ్ అవక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. గతంలో తల్లిదండ్రులు చెబితే అమ్మాయిలు సంబంధం ఒప్పుకునేవారు. ఇప్పుడు తల్లిదండ్రులకు నచ్చినా తమకు నచ్చలేదని రిజెక్ట్ చేస్తున్నారు.

అధిక శాతం అమ్మాయిలు NRI, సాఫ్ట్‌వేర్ , ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న అబ్బాయిల వైపు మొగ్గు చూపతున్నారు. భూములు, ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నారు. జాతకాలు , నక్షత్రాలు చూస్తున్నారు. ఎన్నో సంబంధాలు చూస్తే తప్ప అమ్మాయిలు ఒకే చేయడం లేదు. ఇక అమ్మాయిలు దొరకక కస్తుర్బా మెమోరియల్ ట్రస్ట్ ‌తోపాటు అనాథశ్రమాలలో ఉండే అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. పెళ్లికాని ప్రసాదులను తగ్గించాలంటే భవిష్యత్‌లో స్త్రీ పురుష నిష్పత్తిలో పూర్తిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories