తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన
x
Highlights

తెలంగాణలో రాగల 24గంటల్లో చాలాచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వానలు కురుస్తాయి.

తెలంగాణలో రాగల 24గంటల్లో చాలాచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం ఒడిశాకోస్తా, దాని పరిసరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఆగస్టు 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురుస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories