Top
logo

లండన్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

లండన్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం
X
Highlights

లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న తెలంగాణ విద్యార్థి శ్రీహర్ష అదృశ్యమయ్యాడు. క్వీన్‌ మేరీ యూనివర్శిటీ ఆఫ్‌...

లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న తెలంగాణ విద్యార్థి శ్రీహర్ష అదృశ్యమయ్యాడు. క్వీన్‌ మేరీ యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌లో శ్రీహర్ష ఎంఎస్‌ చేస్తున్నాడు. అతనుంటున్న ప్రాంతం సమీపంలో ఉన్న బీచ్‌లో శ్రీహర్షకు చెందిన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడే శ్రీహర్ష. గత శుక్రవారం నుంచి తన కుమారుడు శ్రీహర్ష కనిపించడం లేదని ఉదయ్‌ ప్రతాప్‌ తెలిపారు. ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకుని మిస్సింగ్‌ కేసు నమోదు చేశామని లండన్‌ పోలీసులు తమకు సమాచారం అందించారని చెబుతున్నారు. ఇటు విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీ నామా నాగేశ్వరరావు శ్రీహర్ష బంధువులతో ఫోన్‌లో మాట్లాడారు. హర్షకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. లండన్‌లో ఉన్న తెలుగువారితో సహా కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story