Degree Courses : డిగ్రీ కోర్సుల్లో కొత్త సబ్జెక్టులు

Degree Courses : డిగ్రీ కోర్సుల్లో కొత్త సబ్జెక్టులు
x
Highlights

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త...

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇక ఈ కోర్సుల వలన విద్యార్థులు ఇలాంటి కొత్త కోర్సులు చేయండం ద్వారా ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువే విద్యార్థులకు ఈ అవకాశం దక్కనుంది. ఇందులో భాగంగానే బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ లాంటి కోర్సుల్ని అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న డిగ్రీ కోర్సులతో ఈ సాంకేతికతను విద్యార్థులు అందుకోవడం కష్టమైపోతున్న తరుణంలో అధికారులందరూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందుకుగాను డేటా సైన్స్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త స్ట్రీమ్స్‌ కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు డిగ్రీలో ప్రవేశపెడుతున్న కోర్సులను ప్రత్యేకంగా ఎవరైనా చదవాలనుకుంటే వారు డిగ్రీ చేసిన తరువాత మళ్లీ ఈ కోర్సులను చదివాల్సి వచ్చేది. అందుకే ఈ సబ్జెక్ట్స్‌తో డిగ్రీ కోర్సుల్ని రూపొందించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

అంతే కాక బీఎస్సీ డిగ్రీలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌తో పాటు డేటా సైన్స్, బీకాంలో బిజినెస్ అనలిటిక్స్ కోర్సులు అదే విధంగా ఆనర్స్ డిగ్రీని కూడా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనుంది. ఈ కోర్సుల్లో రెగ్యులర్‌గా చదివే డిగ్రీల కన్నా ఆనర్స్ డిగ్రీలో 20-30 క్రెడిట్స్ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది. వాటితో పాటుగానే మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్టులను కూడా బీఎస్సీ కోర్సులో కలపనుంది. ఈ కోర్సులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు అధికారులతో పాటు ఆయా సబ్జెక్టుల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకి ఇండస్ట్రీకి చెందిన నిపుణులతో శిక్షణ ఇవ్వనుంది. ఈ కోర్సులు సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల్లో, అటానమస్ కాలేజీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టనున్నటు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. ఇకపోతే ఈ కోర్సుల వలన సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను మరింత తీసుకురావచ్చని తెలిపారు. ఇక ఈ కొత్త కోర్సులపై చర్చించేందుకు వచ్చే వారం మరోసారి కమిటీ సమావేశం కానుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories