కరోనా వైరస్‌ బాధితులకు సింగరేణి కార్మికుల చేయూత...

కరోనా వైరస్‌ బాధితులకు సింగరేణి కార్మికుల చేయూత...
x
Highlights

భూగర్భ పోరల్లోకి వెళ్లి, ప్రాణాలకు తెగించి ప్రజలందరి పనులు నడిచేలా కావలసిన కరెంటు ఉత్పత్తికి సంబంధించిన బొగ్గును వెలికితీసి మృత్యువుతో నిత్యం యుద్ధం చేస్తారు సింగరేణి కార్మికులు.

భూగర్భ పోరల్లోకి వెళ్లి, ప్రాణాలకు తెగించి ప్రజలందరి పనులు నడిచేలా కావలసిన కరెంటు ఉత్పత్తికి సంబంధించిన బొగ్గును వెలికితీసి మృత్యువుతో నిత్యం యుద్ధం చేస్తారు సింగరేణి కార్మికులు. అంతే కాదు వారు సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని దేశంలో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు సీఎం సహాయనిధికి ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సాటి ప్రజల కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచి వారి కష్టంలో ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటిస్తారు.

ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సింగరేణి కార్మికులు, అధికారులు కూడా సహకారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం సహాయ నిధికి వారందరూ తమ ఒక్కరోజు వేతనాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సింగరేణిలో దాదాపు 2,400 మంది అధికారులు, 48వేల మంది కార్మికులు ఉన్నారు. వారిలో అధికారుల ఒక రోజు బేసిక్‌, డిఏ కలిపి సుమారుగా రూ. 1 కోటి ఉండగా, కార్మికుల ఒకరోజు బేసిక్‌, డిఏ కలిపి రూ.7 కోట్ల 50 లక్షలు ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే రూ. 8 కోట్ల 50 లక్షలను సింగరేణి యాజమాన్యం కరోనా బాధితుక సహాయార్థం సీఎం సహాయనిధికి అందజేయనున్నారు. ఇందుకు అంగీకరిచవలసిందిగా అధికారులు, కార్మికులు యజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై స్పందించిన సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రతి గనిలో, కార్మిక కాలనీల్లో, ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఎటువంటి బొగ్గు కొరత లేకుండా సింగరేణి ఉద్యోగులు నిత్యం పాటుపడుతున్నరన్నారు. సింగరేణి కార్మికులు తీసుకున్న ఈ నిర్ఱనయానికి ఆయన హర్షం వ్యక్తం చేసారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధి వలన భారత్‌లో 724 కరోనా కేసులు నమోదు కాగా, 17 మంది మృతి చెందారు.. దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షా డెబ్బై వేల కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు.

ఇక ప్రభుత్వాలతో పాటుగానే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు చేతనైనంత విరాళం అంజేశారు. వారితో పాటుగానే సామాన్య రైతులు, చిన్న ఉద్యోగులు కూడా వారి స్థోమతలో వారు విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఓ సన్నకారు రైతు రూ.50వేలను రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తే, ఈ రోజు ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్ ను విరాళంగా అందజేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories