థాయ్‌లాండ్‌ ప్రభుత్వంతో తెలంగాణ ఒప్పందం

థాయ్‌లాండ్‌ ప్రభుత్వంతో తెలంగాణ ఒప్పందం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మాదాపూర్ లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మాదాపూర్ లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి థాయ్‌లాండ్‌ నుంచి ఉపప్రధాని జరీన్‌ లక్సనావిసిత్‌, మంత్రి కేటీఆర్‌, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

థాయ్ సంస్కృతిని భారతదేశానికి కొత్తగా పరిచయం చేయక్కర్లేదని, థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే థాయ్‌లాండ్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రబ్బర్ వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధి రేటును మించి అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని తెలిపారు. అనంతరం థాయ్‌ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఫర్నిచర్‌ పర్క్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ థాయ్‌లాండ్‌ ఉప ప్రధానిని కోరారు. బ్యాంకాక్‌ - హైదరాబాద్‌ విమాన సర్వీసులు పెంచితే పర్యాటకంగా ఇంకా వృద్ధి చెందుతుందని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories