తెలంగాణ షార్ట్ ఫిలింకు గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు

తెలంగాణ షార్ట్ ఫిలింకు గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు
x
Highlights

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని స్థితి గతులు, తెలంగాణ ప్రాంత ఇతివృత్తంతో రూపొందించిన లఘు చిత్రం గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు అందుకుంది....

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని స్థితి గతులు, తెలంగాణ ప్రాంత ఇతివృత్తంతో రూపొందించిన లఘు చిత్రం గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డు అందుకుంది. నవంబర్ 8 నుంచి 15 వరకు కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ లఘుచిత్రం అవార్డును గెలుచుకుంది. వారం రోజుల పాటు ఎన్నో లఘు చిత్రాలను ప్రదర్శించి నప్పటికీ వాటిలో సమ్మర్ రాప్సోడీ అనే లఘు చిత్రం కోల్‌కతా వేదికగా ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకొన్నది. అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఉత్తమ భారతీయ షార్ట్ ఫిలింగా ఎంపికయింది.

కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు వేడుకలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిధిగా హాజరై అవార్డులు గెలుచుకున్నవారికి అవార్డులను ప్రధాన చేశారు. ఉత్తమ భారతీయ షార్ట్ ఫిలింగా ఎంపికైన సమ్మర్ రాప్సోడీ చిత్రాన్ని శ్రవణ్ కటికనేని రూపొందించారు. ఈ చిత్రానికి రూ.ఐదు లక్షల నగదు పురస్కారం, గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును మమతాబెనర్జీ ప్రదానం చేశారు. ఈ చిత్రాన్ని రూపొందించిన శ్రవణ్ తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాక తెలుగులో వేదం, గమ్యం, ఆనందోబ్రహ్మ చిత్రాలకు ఎడిటర్‌గా కూడా ఆయన పనిచేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories