Top
logo

శుక్రవారం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు.. ఏకగ్రీవం అయినవి ఇవే..

శుక్రవారం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు.. ఏకగ్రీవం అయినవి ఇవే..
Highlights

రెండో విడుత గ్రామ పంచాయితీ ఎన్నిలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం పోలింగ్ జరగనున్నది. 4,135 ...

రెండో విడుత గ్రామ పంచాయితీ ఎన్నిలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం పోలింగ్ జరగనున్నది. 4,135 గ్రామపంచాయతీల్లో వివిధ కారణాల వల్ల 5 గ్రామపంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇప్పటికే 788 పంచాయతీ సర్పంచ్ లు, 10, 317 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 3,342 సర్పంచ్ స్థానాలతో పాటు..26,191 వార్డులకు ఎన్నిక జరగనున్నది. 10,668 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి, 63,440 మంది వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలనుండి మద్యాహం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరిపి సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయనున్నారు.

మొదటి విడతలో వినియోగించిన బ్యాలెట్‌ పెట్టెల్లోని బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో వాటినే రెండో విడతలోనూ వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో పాల్గొన్న పోలింగ్‌ సిబ్బందే రెండో విడతలోనూ విధులు నిర్వహిస్తారు. మొదటి విడతలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం, ఆ తప్పలు తిరిగి జరగకుండచర్యలు చేపట్టడంతో రెండవ విడుతలో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.ఎన్నిక సందర్బంగా పోలింగ్ జరిగే పంచాయితీల్లో కట్టుదిట్లమైన ఏర్పాటు చేస్తోంది ఎన్నిక సంఘం.

విధుల్లో పాల్గొనడానికి వారి వారికి కేటాయించిన గ్రామ పంచాయతీలకు ఎన్నికల అధికారులు సిబ్బంది తరలివెళుతున్నారు .ఎన్నికలు నిర్వహించడానికి సరిపడా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. సిబ్బంది వెళ్లడానికి బస్సులను సిద్ధం చేశారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరించారు.

గ్రామాల్లో డబ్బులు, మద్యం పంపిణీపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Next Story