సమత కేసుపై సర్వత్రా ఉత్కంఠ.. నేడు తుదితీర్పు

సమత కేసుపై సర్వత్రా ఉత్కంఠ.. నేడు తుదితీర్పు
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసుకు సంబంధించి స్పెషల్ కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20న వాదనలు పూర్తి అయ్యాయి....

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసుకు సంబంధించి స్పెషల్ కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20న వాదనలు పూర్తి అయ్యాయి. 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. న్యాయమూర్తి అనారోగ్య కారణంగా తీర్పును ఇవాళ్టికి వాయిదా వేశారు. కొమురంభీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో నవంబర్‌ 24న ముగ్గురు నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లు సమతను అత్యాచారం చేసి, హత్య చేశారు. సమత కేసులో నేడు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంచలనం సృష్టించిన సమతా కేసులో తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమతా దోషులకు కఠిన శిక్ష విధించాలని ఎల్లపటార్‌ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ స్టీలు గిన్నెలు అమ్ముకునే సమతను కుమ్రంభీం జిల్లా ఎల్లపటూర్ అడవుల్లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో లింగాపూర్ కు చెందిన షేక్ బాబు, షేక్ ముగ్ధూం,షేక్ షాబుద్దీన్ ను ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వీరి శిక్షలపై స్పెషల్ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. సమత ఘటనను గోసంపల్లి గ్రామస్థులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరక్కుండా దోషులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు సమతా బంధువులు, గ్రామస్థులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories