పీఎఫ్ బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం: ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

పీఎఫ్ బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం: ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ
x
Highlights

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో కేఎంపీఎల్‌(కిలోమీటర్లు పర్‌ లీటర్‌) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో కేఎంపీఎల్‌(కిలోమీటర్లు పర్‌ లీటర్‌) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల సమష్టి కృషితో నెలకు రూ.80-90 కోట్ల అధిక ఆదాయం వచ్చిందన్నారు.

సంస్థ ఇదే విధంగా ముందుకు కొనసాగితే డిసెంబర్‌లో బోనస్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. బదిలీలు, ఓడి తదితర అంశాలపై సైతం చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ సంస్థను లాభాల్లో నడిపించే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని తెలిపారు.

సురక్షితంగా డ్రైవింగ్‌ చేసి ప్రజలను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతే కాక ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని సంస్థలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై దృష్టిసారించినట్లు తెలిపారు. అదే విధంగా కార్మికులకు ఇచ్చే పీఎఫ్‌ బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని సునీల్‌శర్మ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories