వనస్థలిపురం సూపర్ మార్కెట్ సిబ్బందికి కేటీఆర్ వార్నింగ్

వనస్థలిపురం సూపర్ మార్కెట్ సిబ్బందికి కేటీఆర్ వార్నింగ్
x
Highlights

కరోనా అంటే చాలు ప్రపంచం అంతా ఉలిక్కి పడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విదేశీయులను చూస్తే కంగారు పడుతున్నారు.

కరోనా అంటే చాలు ప్రపంచం అంతా ఉలిక్కి పడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విదేశీయులను చూస్తే కంగారు పడుతున్నారు. ఈ నేపద్యంలో వనస్థలిపురం సూపర్ మార్కెట్లో ఇద్దరికి అవమానం ఎదురైంది. స్టోర్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులను స్టోర్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. వారు విదేశీయులనే అనుమానంతో సిబ్బంది వారిపై వివక్ష చూపించారు. దీంతో బాధితులు ఆ సంఘటనను వీడియో తీసి మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ స్పందించి, సిబ్బంది పై తగిన చర్య తీసుకోవాలని డీజీపీ కి సూచించారు. ఇలాంటి వివక్ష చూపిస్తే సహించేది లేదని, వివక్ష చూపించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వనస్థలిపురం పోలీసులు వెంటనే స్పందించి ఈ చర్యలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.

ఇక స్టోర్ కి వచ్చిన వారిని సిబ్బంది ఇలా చేయడానికి గల కారణాలు చూసుకుంటే, ఆ ఇద్దరు వ్యక్తులు విదేశీయుల మాదిరిగా ఉండడమే దీనికి కారణం. మణిపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈ వ్యక్తులు సుమారుగా విదేశీయులను పోలి ఉన్నారు. మణిపూర్ వాసులు సుమారుగా చైనా వాసుల లాగా పోలికలతో వుంటారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను స్టోర్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. వారు విదేశీయులం కాదని ఆధార్ కార్డు చూపించినా వారిని స్టోర్ సిబ్బంది అనుమతించలేదు. ఇక ఈ విషయం పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్పందించి, ఎవరైనా వివక్ష చూపిస్తే 9490617234 కు కల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories