Top
logo

అత్యవసర విభాగాల్లో విధులకు హాజరవుతున్నారా.. నో టెన్షన్

అత్యవసర విభాగాల్లో విధులకు హాజరవుతున్నారా.. నో టెన్షన్CP Anjani Kumar (File Photo)
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ ను కట్టడి చేయడానికి ఇప్పటి వరకు ఎన్నో చర్యలను తీసుకుంటుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ ను కట్టడి చేయడానికి ఇప్పటి వరకు ఎన్నో చర్యలను తీసుకుంటుంది. ఎప్పటి కప్పుడు ఆరోగ్యశాఖ అధికారులతో ప్రభుత్వం సమీక్షలు నిర్వహించి పరిస్థితులను తెలుసుకుంటుంది. రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎంత మందికి వైద్యం అందిస్తున్నారన్న వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలకు కాపాడేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వాలు స్పష్టం చేసాయి. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఎమర్జెన్సీ అయితేనే కానీ ఎవరూ ఇండ్ల నుంచి బయటికి రావొద్దని నిబంధనలు పెట్టారు. నిబంధనలకు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామిన అధికారులు తెలిపారు. అయితే చాలా మందికి అత్యవసర విభాగాల్లో పని చేసేవారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. వారు తమ కార్యాలయాలకు వెల్లవచ్చని తెలిపారు. కానీ ఎవరు విధులకు వెలుతున్నారు, ఎవరు వెల్లడం లేదనే స్పష్టత లేకపోవడంతో పోలీసులు అందరినీ అడ్డుకోవడంతో విధుల్లో భాగంగా వచ్చిపోయే సమయంలో ఉద్యోగులు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అందులో భాగంగానే హైదరాబాద్ నగర పోలీసు శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర విభాగాల్లో విధులకు హాజరయ్యే వారికి పాసులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కమిషనర్ అంజనీకుమార్ పాసులు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటివరకు 900 పాసులు ఇచ్చామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పాసులు కావాలను కున్న వారు ఆన్‌లైన్‌లో [email protected] ద్వారా వినతులు పంపాలి. లేకపోతే 94906 16780 నంబరుకు వాట్సప్‌లోనూ మెస్‌జ్ రూపంలో పంపొచ్చని తెలిపారు.


Web TitleTelangana Police Department issues Pass for those who are working in emergency departments during corona outbreak
Next Story


లైవ్ టీవి