Top
logo

TS పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

TS పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మా ప్రవేశాలు రాసే విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మా ప్రవేశాలు రాసే విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. ఇందుకు గాను దీనికి సంబంధించిన టీఎస్‌ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి బుధవారం విడుదలచేశారు. ఈ నోటిఫికేషన్ ను మార్చి 4వ తేదీన జారీచేయనున్నారు. అప్లికేషన్‌ను విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తూ చేసుకోవాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.

షెడ్యూల్ వివరాలను చూసుకుంటే పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్ ను మార్చి 3 - 2020 న విడుదల చేయనున్నారు. మార్చి 12 - 2020 తేదీన ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 30 - 2020వ తేదీన అప్లికేషన్‌ గడువుకు చివరి రోజు. మే 26 - 2020 తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరించనున్నారు. మే 20 నుంచి 27 మే వరకు విద్యార్థులకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మే 28 నుంచి 31మే వరకు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్‌ 15 - 2020 తేదీ రోజున ప్రవేశ పరీక్షల ఫలితాలను విద్యామండలి ఫలితాలను వెల్లడించనున్నారు.
Web TitleTelangana PG E - set Schedule Release
Next Story


లైవ్ టీవి