తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పట్టణ ప్రగతి..

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పట్టణ ప్రగతి..
x
KTR File Photo
Highlights

నిన్న మొన్నటి వరకూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ది చేసిన ప్రభుత్వం అదే మార్గంలో ఈ రోజున పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించబోతుంది.

నిన్న మొన్నటి వరకూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ది చేసిన ప్రభుత్వం అదే మార్గంలో ఈ రోజున పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు చేపట్టారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేసీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24వ తేది నుంచి వచ్చే నెల 4వ తేదీవరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పదిరోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో అభివృద్ది పనులను నిర్వహించడానికి జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలను, కార్పోరేషన్లకు ఎంచుకున్నారు. అభివృద్ది పనులకోసం రూ.148 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేవిధంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇక నూతనంగా నియమితులైన జిల్లా అదనపు కలెక్టర్లు పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పట్టణప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ఇందులో భాగంగా పదిరోజులకు కార్యాచరణను కూడా రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీల ఏర్పాటు, మంచినీటి సరఫరా, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, పబ్లిక్‌ టాయిలెట్ల కోసం అవసరమైన స్థలాల గుర్తించనున్నారు. అంతే కాకుండా పట్టణ జనాభాకు అనుగుణంగా పరిశుభ్రమైన వెజ్‌, నాన్‌ వెజ్‌, ఫ్రూట్‌, ఫ్లవర్‌ మార్కెట్లు ఏర్పాటుచేయనున్నామని తెలిపారు.

అంతే కాకుండా పట్టణాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచడానికి కావలసిన ప్రజారోగ్య పర్యవేక్షణ ఇయర్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలిపారు. దాంతోపాటుగానే ఘనవ్యర్థాలు, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను చెరువుల్లో కలుపకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తను తరలించడంతోపాటు మురికికాల్వలను, బహిరంగ ప్రదేశాలను శుభ్రపర్చే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చురుగ్గా పాల్గొని ప్రజలు తమకు అందించిన ఆశీర్వాదాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అంతే కాక ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్‌ కోరారు.

పట్టణప్రగతికి రూ.148 కోట్లు విడుదల..

జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలకు రూ.148 కోట్లు విడుదలచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.1.29 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.2.05 కోట్లు, కామారెడ్డికి రూ.1.34 కోట్లు, కరీంనగర్‌కు రూ.3.57 కోట్లు, మేడ్చల్‌ మల్కాజిగిరికి రూ.3.94 కోట్లు, నాగర్‌కర్నూల్‌కు రూ.1.11 కోట్లు, నల్లగొండకు రూ.3.41 కోట్లు, నారాయణపేటకు రూ.84.05 లక్షలు, నిర్మల్‌కు రూ.1.46 కోట్లు, నిజామాబాద్‌కు రూ.4.43 కోట్లు, పెద్దపల్లికి రూ.2.85 కోట్లు, మెదక్‌కు రూ.1.06 కోట్లు, రాజన్న సిరిసిల్లకు రూ.1.22 కోట్లు, రంగారెడ్డికి రూ.5.56 కోట్లు, సంగారెడ్డికి రూ.3.22 కోట్లు, ఖమ్మంకు రూ.3.62 కోట్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు రూ.48.48 లక్షలు.

జగిత్యాలకు రూ.2.29 కోట్లు, జనగామకు రూ.45.67 లక్షలు, జయశంకర్‌ భూపాలపల్లికి రూ.56.79 లక్షలు, జోగుళాంబ గద్వాలకు రూ.1.24 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.2.56 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.12 కోట్లు, మంచిర్యాలకు రూ.3.18 కోట్లు, సిద్దిపేటకు రూ.2.07 కోట్లు, సూర్యాపేటకు రూ.2.46 కోట్లు, వికారాబాద్‌కు రూ.1.57 కోట్లు, వనపర్తికి రూ.1.24 కోట్లు, వరంగల్‌ రూరల్‌కు రూ.72.03 లక్షలు, వరంగల్‌ అర్బన్‌కు రూ.7.34 కోట్లు, యాదాద్రి భువనగిరికి రూ.1.64 కోట్లు, హైదరాబాద్‌కు రూ.78 కోట్ల చొప్పున విడుదలయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories