Top
logo

తొలివిడతలో ఏకగ్రీవమైన పంచాయితీలు ఇవే..

తొలివిడతలో ఏకగ్రీవమైన పంచాయితీలు ఇవే..
X
Highlights

తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు...

తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటల లోపే ఫలితాలు కూడా వెలువడిస్తారు. మొదటి విడతలో 4479 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా.. వీటిలో 769 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 9 పంచాయతీలకు నామినేషన్లు అస్సలు దాఖలు కాలేదు..

తొలివిడతలో ఏకగ్రీవమైన పంచాయితీలు ఇవే..మొత్తం 3,701 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 12వేల 202 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. అలాగే 39,822 వార్డు సభ్యుల పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా.. 10,654 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా అయ్యారు. 192 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తం 28,976 వార్డు సభ్యుల పదవులకు 65 వేలమందికి పైగానే పోటీలో ఉన్నారు. కాగా పోలింగ్‌లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.

Next Story