logo

మంత్రులకు శాఖల కేటాయింపు

మంత్రులకు శాఖల కేటాయింపు
Highlights

మంగళవారం ఏర్పడ్డ కొత్త మంత్రివర్గంలో పదిమంది మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా.....

మంగళవారం ఏర్పడ్డ కొత్త మంత్రివర్గంలో పదిమంది మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా.. వేముల ప్రశాంత్ రెడ్డికి - రోడ్లు భవనాలు, రవాణా శాఖ. నిరంజన్ రెడ్డికి - వ్యవసాయ శాఖ. ఇంద్రకరణ్ రెడ్డికి - న్యాయ, అటవీ, దేవాదాయ శాఖ. జగదీశ్ రెడ్డికి - విద్యా శాఖ. కొప్పుల ఈశ్వర్ కు - సంక్షేమం. మల్లారెడ్డికి - కార్మిక శాఖ, ఈటెల రాజేందర్ కు - వైద్య ఆరోగ్య శాఖ. శ్రీనివాస్ గౌడ్ కు - 'టూరిజం , క్రీడలు , యువజన సర్వీసులు'. ఎర్రబెల్లి దయాకర్ రావుకు - పంచాయితి రాజ్ శాఖ కేటాయించారు. కాగా హోమ్ శాఖను ఉపముఖ్యమంత్రి మొహమ్మద్ అలికి కేటాయించిన కేసీఆర్.. ఇక ఆర్ధిక శాఖ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top