మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే.. అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసిన టీఆర్‌ఎస్..

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే.. అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసిన టీఆర్‌ఎస్..
x
మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే
Highlights

తెలంగాణలో ఈరోజు 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. అయితే, మున్సిపోల్స్‌లో దాదాపు క్లీన్...

తెలంగాణలో ఈరోజు 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. అయితే, మున్సిపోల్స్‌లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఒకట్రెండు సీట్లు తక్కువైన మున్సిపాలిటీల్లో కూడా ఎక్స్‌-అఫిషియో ఓట్లతో ఛైర్మన్‌గిరిని కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఇక, మేయర్ అండ్ ఛైర్మన్‌ అభ్యర్ధుల జాబితాను టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీతో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించారు. 110కి పైగా మున్సిపాల్టీల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో ఇక మిగిలిన చోట కూడా అవకాశం ఉన్న మున్సిపాల్టీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

వచ్చే నాలుగేళ్లపాటు టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని, గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసే అవకాశం టీఆర్‌ఎస్ ద్వారానే లభిస్తుందన్న విషయాన్ని స్థానిక నాయకత్వం ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థులకు వివరిస్తోంది. ఇప్పటికే 90శాతం మంది ఇండిపెండెంట్లు తమకు మద్దతిచ్చేందకు ముందుకొచ్చినట్టు ఎమ్మెల్యేలు పార్టీ దృష్టికి తెచ్చారు. దీంతో స్థానికంగా పార్టీకి లభించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యతోపాటు మున్సిపల్ పీఠానికి కావాల్సిన బలం, అవసరమైన ఎక్స్ అఫిషియో సభ్యుల సం‌ఖ్య వంటి అంశాలపై అధిష్టానం చర్చిస్తోంది. దీంతోపాటు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫిషియో సభ్యులు స్థానికంగా ఏఏ మున్సిపల్ సంఘాలను ఎంచుకోవాలో పార్టీ సూచిస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట్ల ఒకటి, రెండు ఓట్లు అవసరమైన చోట్ల ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో టీఆర్ఎస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories