Top
logo

లాఠీ పట్టిన తెలంగాణ మంత్రి...

లాఠీ పట్టిన తెలంగాణ మంత్రి...
X
Srinivas Goud
Highlights

కేంద్రం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

కేంద్రం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం ప్రజాప్రతినిధులకు, నాయకులకు లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత నాయకులకు, అధికారులకు, పోలీసులకు ఉందని స్పష్టం చేసారు. దీంతో మంత్రులు, నాయకులు, అధికారులు, పోలీసులు అందరూ రోడ్లపైకి వస్తున్నారు.

లాక్ డౌన్ ను విజయవంతం చేయాలని తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ కోణంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ పట్టణంలో రోడ్డుపైకి వచ్చారు. పోలీసులతో పాటు ఆయన కూడా లాఠీపట్టుకుని లాక్ డౌన్‌ను సమీక్షించారు. చేతిలో లాఠీ పట్టుకుని రోడ్డుపూ టూ వీలర్లు, ఫోర్ వీలర్ల మీద వస్తూ పోతున్నవారిని, పాదాచారుని ఆపారు. లాక్ డౌన్ అని తెలిసి కూడా ఎందుకు బయటికి వచ్చారు, ప్రాణాలంటే లెక్క లేదా అని వారిని ప్రశ్నించారు. వారందరినీ ఇండ్లకు వెల్లాలని తెలిపారు.

అసలు ప్రభుత్వం లాక్ డౌన్ ఎందుకు అమలు చేస్తోంది తెలుసా? దీని వల్ల ఏం జరుగుతుంది ? అనే దానిపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇంకో సారి ఇలా బయటికి వచ్చి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించొదన్నారు. మొదటి సారి కాబట్టి వదిలేస్తున్నామని, మరో సారి ఇది జరిగితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన వారికి వార్నింగ్ ఇచ్చారు.


Web TitleTelangana Minister Srinivas Goud Came on the road to review the lockdown situation
Next Story