త్వరలోనే రాజీవ్ గృహకల్ప ఇండ్లను పూర్తి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

త్వరలోనే రాజీవ్ గృహకల్ప ఇండ్లను పూర్తి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
x
సత్యవతి రాథోడ్ (ఫైల్ ఫోటో)
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తరవాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తరవాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ అర్భన్ జిల్లా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఆమె పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాలంటే మురికి కూపాలుగా కాకుండా ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని ఆమె అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాన ప్రభుత్వం ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.

నిరుపేదలకు నీడ నివ్వాలన్న ఉద్దేశంతో అదే విధంగా పేదవాళ్లు కూడా ఆత్మగౌరవంతో నివసించాలన్న గొప్ప లక్ష్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో రాజీవ్ గృహ కల్ప ద్వారా ఇండ్లు సాంక్షన్ అయిన వారికి సకాలంలో ఇండ్లు పూర్తి కాలేక ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. అలా మధ్యలో ఆగిపోయిన ఇండ్లను నిర్మాణాలను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారని తెలిపారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వం రూ.10. 34 లక్షల రూపాయలు సిఎం కేసిఆర్ కేటాయించి, వీటిని పూర్తి చేయాలని చెప్పారని తెలిపారు. రాజీవ్ గృహకల్పలో ఇండ్లను పూర్తి చేస్తే అందులో మొత్తం 734 కుటుంబాలు నివాసం ఉండేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. అందుకు గాను అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. దాంతో పాటుగానే వరంగల్ జిల్లాలో కూడా అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు.

అనంతరం పట్టణంలోని పలు వార్డులలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఇందులో భాగంగానే పట్టణాల్లో ఇండ్ల సమస్య ఉందని తెలిపారు. అనంతరం స్థానిక సమస్యలను తెలుసుకుని అనంతరం వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వార్డు నేతలున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories