పనిలేక విమర్శలు చేస్తున్నారు: నిరంజన్‌రెడ్డి

పనిలేక విమర్శలు చేస్తున్నారు: నిరంజన్‌రెడ్డి
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందిస్తున్న రైతు బంధు నిధులు రాష్ట్రంలో ఉన్నఅందరి రైతులకు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందిస్తున్న రైతు బంధు నిధులు రాష్ట్రంలో ఉన్నఅందరి రైతులకు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబంధు నిధులు నేరుగా తమ అకౌంట్లల్లో నేరుగా పడుతున్నాయని తెలిపారు. కొన్ని సార్లు మాత్రం సాంకేతిక లోపాల వలన బ్యాంక్ అకౌంట్లల్లో నిధులు బదిలీ కావడానికి కాస్త ఆలస్యం అవుతుందని వారు తెలిపారు. ఇలాంటి లోపాలను త్వరలోనే అధిగమిస్తామని అందుకు కృషి చేస్తామని ఆయన రైతులకు ఇచ్చారు. ఈ ఏర్పాట్ల కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుబంధుతో రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పామ్ ఆయిల్ ధర టన్నుకు 12వేలు ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టి అధ్యయనం చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాబోయే రెండేళ్ల కాలంలో 18వేలకుపైగా హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖమ్మం,నల్గొండ,కొత్తగూడెం జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పథకం ద్వారా రాయితీ అందిస్తున్నాము. మంత్రి స్వయంగా స్వయంగా 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారని తెలిపారు. ఈ మొక్కలు పెంచడానికి గాను షెడ్యూల్ కులాలు, తెగలకు 100శాతం, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం రాయితీ ఇస్తున్నాము.

అనంతరం రైతులు పండిస్తున్న పంటల గురించి మాట్లాడుతూ కంది పంటను మొత్తం తామే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. కొంతమంది బీజేపీ నేతలు పనిలేక విమర్శలు చేస్తున్నారని, రైతు బంధుకు సంబంధించి, రైతు ఆత్మహత్యల గురించి ఆరోపణలు చేసే విపక్షనేతలు ఆధారాలు చూపించాలని మంత్రి సవాలు విసిరారు. తాము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనుల్లో ఉన్నామని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories