వైద్య సిబ్బంది లాక్‌డౌన్‌ చేస్తే.. మీ పరిస్థితి ఏంటి?

వైద్య సిబ్బంది లాక్‌డౌన్‌ చేస్తే.. మీ పరిస్థితి ఏంటి?
x
KTR (File Photo)
Highlights

కోరలు చాచిన కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

కోరలు చాచిన కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్భంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా కొంత మంది మాత్రం అధికారుల మాట వినకుండా రోడ్లపై తిరుగుతుండడంతో ఓ వైద్యుడు తన ఆవేదనను ఓ వీడియోలో వ్యక్త పరిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో దేశంలో, రాష్ట్రంలో కరోనా ఎంత ప్రమాదకరంగా మారిందో, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుపుతున్నారు. ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విటర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ డాక్టర్‌ చెప్పింది శ్రద్దగా వినండి అంటూ పేర్కోన్నారు.

ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు రోడ్లపై తిరుగుతున్నారని వైద్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై తిరిగితే నీకు కరోనా వచ్చిన విషయం 14 రోజుల వరకు తెలియదని చెప్పారు. ఆ లోపు నీవు ఎంతో మందిని కలుస్తావని, అది వారందరికీ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వారు మరి కొంత మందికి అంటిస్తారని తెలిపారు. అలా జరిగినపుడు నీవు నీ కుటుంబానికి, ఐన వారందరికీ దూరమవుతావని అన్నారు. నీతో పాటు నువు వైరస్ అంటించిన వారందూ పోతారని తెలిపారు. నీ వల్ల నీ కుటుంబం, నీ పక్కింటివాళ్లు, నీ ఫ్రెండ్స్‌, వాళ్ల కుటుంబాలు ఇంత మంది నీ వెనక రావాలా? ఏ నువ్వు ఒక్కడివి ఇంట్లో కూర్చోలేవా? కొన్ని రోజులు నువ్‌ బయటకి రాకపోతే దేశానికి ఏమైనా నష్టమా? అని ప్రశ్నించారు.

మిమ్మల్ని అందరినీ ఇంట్లో ఉండమని పోలీసులు, పారిశుద్య కార్మికులు, మా వైద్య బృందారు రేయీ పగలు పనిచేస్తున్నామన్నారు. మాకు మాత్రం కుటుంబాలు లేవా? అంటూ ఆవేదన చెందారు. మా ప్రాణాల మీద మాకు ఇష్టం, ప్రేమ, ఆశ ఉంటుంది కదా! మా కోసం మా కుటుంబాలు ఇంటి దగ్గర వేచి చూస్తుంటాయి కదా! మేము కూడా లాక్‌డౌన్‌ చేసుకొని ఇంట్లో ఉండిపోతే మీ పరిస్థితి ఏంటి? ఏడుంటవ్‌?. అయినా మీ అందరి ప్రాణాలు కాపాడటానికి మేము నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు.

అయినా మీరు పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారన్నారు. మా ప్రాణాలు తెగించి మీ కోసం ఇంత చేస్తుంటే మీరేమో బయట పెత్తనాలు చేస్తుంటారా? అని ప్రశ్నించాడు. మీకెవరికీ బాధ్యత లేదా? చదువుకోలేదా? అర్థం కాదా? దయచేసి ప్రజలందరికి అభ్యర్థిస్తున్నా? కొన్ని రోజులు అందరూ ఇండ్లలోనే ఉండండి అని కోరారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories