ముగ్గురు వైద్యులపై కేటీఆర్ ప్రశంసలు

ముగ్గురు వైద్యులపై కేటీఆర్ ప్రశంసలు
x
KTR(file photo)
Highlights

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చేది వైద్యుడు అంటారు.

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చేది వైద్యుడు అంటారు.అది నిజమే ప్రస్తుతం ప్రపంచంలో విజృంభిస్తున్న వైరస్ బారిన పడి వేలల్లో చనిపోతుంటే, లక్షల మంది వైరస్ బారిన పడి ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అలాంటి వారికి వైద్యులు అహర్నిషలు వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. వైద్య వృత్తికి న్యాయం చేస్తున్నారు. తమ గురించి, తమ కుటుంబం గురించి ఆలోచించడం మానేసి కేవలం వారిని శరను కోరుతూ వచ్చిన రోగుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.

సమస్త ప్రాణకోటిని కాపాడే ఆ దేవుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న వైరస్ ను పారదోలకుండా గుడిలోనే ఉన్నాడు. కానీ ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి తాము అనారోగ్యం పాలవుతాం అని తెలిసినా కూడా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సేవలను అందిస్తున్నారు. కొంత మంది వైద్యులు తమ వృత్తిలో కన్నుమూస్తున్నారు. అందుకే చాలా మంది దేవుని తరువాత వైద్యులకే రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారు.

ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు సేవలందిస్తున్నారు. వారి సొంత భద్రత గురించి పట్టించుకోకుండా సమాజానికి సేవ చేస్తున్నారు. డాక్టరు మహబూబ్ ఖాన్, ఆయన భార్య డాక్టరు షహానా ఖాన్, వారి కుమార్తె డాక్టరు రషికా ఖాన్ లు వైద్య వృత్తికే న్యాయం చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఓ వార్తా కథనం ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైంది. దాన్ని చదివిన మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

'కరోనా' బాధితులకు వైద్య సేవలందిస్తున్నారని, ఆ మహమ్మారిపై పోరాడేందుకు తమను తాము అంకితం చేసుకున్నారని కొనియాడారు. వారిని హృదయ పూర్వకంగా ప్రశంసించారు. ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని కూడా తన ట్విటర్ లో జతపరిచారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories