విద్యార్థులకు కేటీఆర్ సూచనలు...గ్రేట్ ఐడియా సార్ అంటున్న నెటిజన్లు

విద్యార్థులకు కేటీఆర్ సూచనలు...గ్రేట్ ఐడియా సార్ అంటున్న నెటిజన్లు
x
KTR (File Photo)
Highlights

రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ప్రతి ఇక్కరూ ఇంట్లోనే ఉంటూ ఎవరి స్టైల్ లో వారు కాలక్షేపం చేస్తున్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ప్రతి ఇక్కరూ ఇంట్లోనే ఉంటూ ఎవరి స్టైల్ లో వారు కాలక్షేపం చేస్తున్నారు. పెద్దవారు ఇంటి పనుల్లో, చిన్న పిల్లలు ఆటల్లో, కార్టూన్ చూడడంతో బిజీ అయిపోయారు. కానీ రాష్ట్రంలో పిల్లలకు జరగాల్సిన ఎన్నో పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు పూర్తి కాని పిల్లలు ఎప్పుడు తమకు పరీక్షలు నిర్వహిస్తారా ఏం రాయాల అంటూ పరీక్షల కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిల్లలను ఉద్దేశించి ఓ మంచి సలహా ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో పిల్లలు తమ విలువైన సమయాన్ని వృద్ధా చేసుకోకుండా చదువుకోవాలని తెలిపారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంట్లో ఉంటున్న పిల్లల కోసం గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో కాస్లులను ప్రసారం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ట్విటర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. ఈ కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకు మాత్రమే కాకుండా కళాశాల విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. తల్లితండ్రులకు ఈ మేరకు ఆయన సూచనలు చేశారు. ఈ చానెల్ ద్వారా పోటీ పరీక్షలకు విద్యార్థులంతా సిద్ధం కావచ్చని ట్వీట్ ద్వారా కేటీఆర్ సలహా ఇచ్చారు. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. విద్యార్థులకు మంత్రి మంచి సలహా ఇచ్చారని పొగుడుతున్నారు. గ్రేట్ ఐడియా సార్ జీ అంటూ బదులు ఇస్తున్నారు.

ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. తనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలని తన ట్విటర్ ఫాలో వర్లతో పంచుకుంటారు. అంతే కాదు రాష్ట్ర ప్రజలు తమకు ఏదైనా సమస్య ఉందని ఆయన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆయన దృష్టికి తీసుకువస్తే చాలు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వారి మెసేజ్ పై స్పందించి రిప్లై ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది ట్విటర్ ద్వారా తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో కేటీఆర్ తన బిజీ షెడ్యూల్‌లోనూ రిప్లై ఇస్తూ ప్రతి ఒక్కరికీ తన కార్యాలయం ద్వారా సాయం పొందాలని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories