మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు

మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు
x
Jagadish Reddy (File Photo)
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ దిశగా నిన్న నిర్వహించన సమావేశంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో లాక్ డౌన్ నిర్వహించాలని తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ దిశగా నిన్న నిర్వహించన సమావేశంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో లాక్ డౌన్ నిర్వహించాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజున లాక్‌డౌన్‌ పరిస్థితిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వీయ నిర్భంధంలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు సీఎం సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

కంటికి కనబడని వైరస్ ఇప్పటి వరకు ఎంతో భీబత్సం సృష్టించిందని, ఆ విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండక పోతే అనర్దాలు చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ప్రజల ప్రాణాలను తీస్తున్న కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి ఉండాలన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల ఆరోగ్యభద్రత కోసమే అని ఆయన అన్నారు.

మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమంతట తామే లాక్‌డౌన్‌ విజయవంతం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘన జరిగితే పరిస్థితులు చెయ్యి దాటి పోయే ప్రమాదం ఉంది. స్వీయనియంత్రణ తోటే వైరస్ ను అరికట్టొచ్చు. సమస్యను అరికట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories