నాన్నొస్తాడనుకుంటే..డెత్‌ సర్టిఫికెట్‌ వచ్చింది

నాన్నొస్తాడనుకుంటే..డెత్‌ సర్టిఫికెట్‌ వచ్చింది
x
Representational Image
Highlights

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది వలస కార్మికులు బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు తరలుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది వలస కార్మికులు బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు తరలుతున్నారు.ఎంతో కొంత సంపాదించి ఆర్థికంగా కొంత ఎదుగుదామనుకుంటున్నారు. కానీ విధి వక్రీకరించి ఆ పరాయి దేశంలోనే కన్ను మూస్తున్నారు. వారినే నమ్ముకున్నవారిని అనాధలుగా వదిలి పోతున్నారు. ఎక్కడో దేశం కాని దేశంలో కన్ను మూసిన వారిని కుటుంబ సభ్యులు చివరి చూపులు చూసుకోవడానికి కూడా నోచుకోవడం లేదు.

సరిగ్గా ఇలాంటి సంఘటనే మానకొండూర్‌ రూరల్‌ లో చోటు చేసుకుంది. పొట్ట కూటి కోసం దుబాయ్‌ వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో అక్కడే మృతిచెందాడు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని ఖననం చేసారు. ఆ తరువాత ఆ వ్యక్తి చనిపోయినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ ను ఆ కుటుంబ సభ్యులకు పంపించారు. విదేశాలకు వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడు, తమని చూసుకుంటాడు అని ఎదురు చూస్తున్న భార్య పిల్లలు, తల్లి ఈ డెత్ సర్టిఫికెట్ చూసి ఒక్క సారిగా నిర్ఘాంత పోయారు. తమ కోసం బొమ్మలు తెస్తాడునకున్న అతని పిల్లలకు బెదురుచూపులే మిగిలాయి.

ఈ విషాదకరన సంఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం జగ్గయ్యపల్లిలో చోటు చేసుకుంది. జగ్గయ్యపల్లికి చెందిన ఉయ్యాల పర్శరాములు(36) అనేవ్యక్తి నాలుగేళ్ల కిందట బతుకుదెరువు కోసం దుబాయ్‌ యునైటెడ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లాడు. అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న అతను కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. దీంతో అక్కడే ఓ దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న సమయంలో మే 13వ తేదీన మృతి చెందాడు. దీంతో అధికారులు అతనికి అక్కడే ఖననం చేసి, డెత్‌ సర్టిఫికెట్‌ను స్వగ్రామానికి పంపించారు. దీంతో ఆ కుటుంబం తమ పెద్ద దిక్కును కోల్పోయింది. చనిపోయిన వ్యక్తికి 2008లో అనితతో వివాహం కాగా, ఇద్దరు కొడుకులు శ్రీయేష్‌(9), శ్రీమాన్‌(6) జన్మించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories