మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు..త్వరలో హాల్ టికెట్ల జారీ

మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు..త్వరలో హాల్ టికెట్ల జారీ
x
Highlights

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు మార్చి 4వ తేది నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సనం పరీక్షలు మార్చి 4వ తేదీన ప్రారంభం అయి మార్చి 21ముగియనున్నాయి.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు మార్చి 4వ తేది నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సనం పరీక్షలు మార్చి 4వ తేదీన ప్రారంభం అయి మార్చి 21ముగియనున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీన ప్రారంభం అయి మార్చి 23వ తేదీన ముగియనున్నాయి.

ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ నేపథ్యలోనే అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లకు హాల్ టికెట్లను పంపిస్తున్నారు. అంతే కాకుండా ఇంటర్ బోర్డు తన అధికారిక వెబ్ సైట్లోనూ హాల్ టికెట్లను భద్రపరచనుంది. ఎవరికైతే హాల్ టికెట్లు అందవో ఆ విద్యార్థులు ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చి తెలిపింది.

కొన్ని కళాశాల యాజమాన్యాలు ట్యూషన్‌ ఫీజుల పేరుతో, హాజరు శాతం తక్కువ ఉన్నాయని విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. హాల్‌టికెట్లు ఇవ్వని యాజమాన్యాలపై చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఈ కోణంలో ఆలోచించిన బోర్డు సభ్యులు ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు.

ఇక పోతే ఇంటర్ పరీక్షలు రాయడానికి రాష్ట్రవ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారని తెలిపారు. వీరిలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4.8 లక్షలు, ద్వితీయ సంవత్సరంలో 4.85 లక్షల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ఈ సమాచారాన్ని బోర్డు అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం..

విద్యార్థులు ముందు ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. http://bie.telangana.gov.in/ లేదా https://tsbie.cgg.gov.in/home.do

♦ తరువాత పైన పేర్కొన్న లింక్ లను క్లిక్ చేయాలి.

♦ తరువాత అందులో విద్యార్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ తో సహా ఎంటర్ చేయాలి.

♦ తరవాత హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories