'నో స్మోకింగ్' తెలంగాణ సర్కార్ వినూత్న ప్రయత్నం

నో స్మోకింగ్ తెలంగాణ సర్కార్ వినూత్న ప్రయత్నం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రస్తుతకాలంలో ఎంతో మంది యువత దురవాలట్లకు బానిసలవుతున్నారు. బాల్యదశనుంచి పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా పెంచినప్పటికీ ఒక దశ వచ్చిన తరువాత అనుకోకుండా చెడుదారి పట్టే అవకాశం ఉండకపోలేదు.

ప్రస్తుతకాలంలో ఎంతో మంది యువత దురవాలట్లకు బానిసలవుతున్నారు. బాల్యదశనుంచి పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా పెంచినప్పటికీ ఒక దశ వచ్చిన తరువాత అనుకోకుండా చెడుదారి పట్టే అవకాశం ఉండకపోలేదు. ముఖ్యంగా టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత వారు కొన్ని దురవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మందుతాగడం, సిగరెట్ తాగడం ఇలా చెడు వ్యసనాలను నేర్చకుంటారు. అలాంటప్పుడు పెద్దవారు వారికి నయానో, భయానో నచ్చజెప్పి అలవాట్లను మాన్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే దీనివలన ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనమవుతుంది. టీనేజ్‌లోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు.. స్కూల్ జీవితానికి గుడ్‌బై చెప్పి ఇంటర్‌ అనే స్వేచ్ఛాయుత జీవితం కోసం వెతుకుతారు.

కగా తెలంగాణ సర్కార్ ఇప్పుడు యువతను దురవాలట్ల నుంచి దూరం చేసే దిశగా ఆలోచన చేసి దాన్ని ఆచరించేందుకు ముందుకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ కాళాశాలలో 'నో స్మోకింగ్' బోర్డులను ఏర్పాటు చేయించబోతుంది. అంతే కాక క్యాంపస్ పరిధిలో పొగాకు, దాని ఉత్పత్తులను వాడకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశించారు. ఈ విధంగా ఇంటర్ కాలేజీలను పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దురవాట్లను విద్యార్థుల నుంచి దూరం చేసి బంగారు భవిష్యత్తును ఇవ్వాలని చూస్తోంది.

ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, నోడల్ అధికారులు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే కళాశాలలో పొగాడు నివారణా చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, పొగాకు నియంత్రణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

కాగా ఇటీవల గ్లోబల్ అడల్ట్ టొబాకో ఆఫ్ ఇండియా ప్రకారం చేసిన సర్వేలో భారత దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా పొగాకును వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉండిపోయిందని తెలిపారు. వీరిలో ఎక్కువగా 17.8 శాతం మంది యువకులు(15 ఏళ్లు, ఆపైన) పొగాకు, దాని ఉత్పత్తులు వాడుతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories