బోనాల ఉత్సవాల ప్రచారంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

బోనాల ఉత్సవాల ప్రచారంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
x
Highlights

తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాల ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లెక్సీలు, ప్రచార సామాగ్రితో...

తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాల ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లెక్సీలు, ప్రచార సామాగ్రితో రోడ్లు, గోడలు ధ్వంసం చేస్తున్నారని హైకోర్టు సీరియస్ అయ్యింది. కాచిగూడలో బోనాల ఉత్సవ నిర్వాహకులు జీహెచ్ఎంసీకి 50 వేలు డిపాజిట్ చేయాలని ఆదేశించిన హైకోర్టు ఆ నిధులతో రోడ్లు, గోడలు మరమ్మత్తు చేయించాలని ఆదేశింది. ఈ మేరకు జస్టిస్‌ పి. నవీన్‌రావు గురువారం ఆదేశాలు జారీచేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా ఆర్చీలు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఒక నివేదికను కోర్టుకు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories