Top
logo

విద్యార్థి అఖిల్‌ పిటిషన్‌పై ఇవాళ కొనసాగనున్న విచారణ

విద్యార్థి అఖిల్‌ పిటిషన్‌పై ఇవాళ కొనసాగనున్న విచారణ
Highlights

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ...

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనుంది. దసరా సెలవులు పెంచడం వల్ల విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గందరగోళానికి గురవుతున్నారని విద్యార్థి అఖిల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం ద్వారా 70 శాతం బస్సులను నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని అలా అయితే విద్యార్థులకు ఎందుకు సెలవులు ప్రకటించిందని పిటిషన్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. నిన్న విచారణ సందర్భంగా ఈ రెండింట్లో ఏది వాస్తవమని ధర్మాసం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళ ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌పై వాదనలు జరగనున్నాయి.

Next Story