TSRTC: సమ్మె బంతి.. సర్కారు కోర్టులో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?

TSRTC: సమ్మె బంతి.. సర్కారు కోర్టులో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
x
Highlights

అటూ ఇటూ తిరిగి.. సమ్మె బంతి.. సర్కారు కోర్టులో పడింది. ఓ వైపు సమ్మె కొనసాగుతుందని జేఏసీ తేల్చిచెప్పడం మరోవైపు సమ్మెకు టీఎన్జీవోలు మద్దతివ్వడం ఇంకోవైపు...

అటూ ఇటూ తిరిగి.. సమ్మె బంతి.. సర్కారు కోర్టులో పడింది. ఓ వైపు సమ్మె కొనసాగుతుందని జేఏసీ తేల్చిచెప్పడం మరోవైపు సమ్మెకు టీఎన్జీవోలు మద్దతివ్వడం ఇంకోవైపు కార్మిక నేతలతో చర్చలు జరపాలంటూ హైకోర్టు ఆదేశించడం వెరసి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదోనని ఉత్కంఠ రేగుతోంది. ఇక ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆ నిర్ణయమే ఆర్టీసీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఆర్టీసీ సమ్మె కీలక దశకు చేరుకుంది. 12 రోజులుగా కొనసాగుతున్న సమ్మెతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించిన కార్మిక నాయకులు రోజుకో తీరున నిరసన తెలుపుతున్నారు. ఇవాళ అన్ని డిపోల దగ్గర ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించిన ఆర్టీసీ సమ్మెకు తాజాగా కీలకమైన టీఎన్జీవో కూడా సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మొత్తం నాలుగు తీర్మానాలు చేసిన ప్రతినిధులు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ దగ్గరకు పంపాలని నిర్ణయించారు.

ఇక ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మెకు దిగిన యూనియన్లది చర్చలు జరపకుండా తాత్సారం చేసిన ప్రభుత్వానిదీ తప్పేనని వ్యాఖ్యానించింది. రెండు రోజుల్లో చర్చలు ముగించి తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆర్టీసీ ఎండీ లేకుండా సంస్థలను ఎలా నడుపుతారని ప్రశ్నించిన ధర్మాసనం వెంటనే ఎండీ నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు అందలేదంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

అయితే సమ్మె జరుగుతున్నా ప్రజల అవసరార్థం 90 శాతానికి పైగా బస్సులు నడుస్తున్నాయని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో పరిణామాలిలా ఉంటే కేంద్రంలో కూడా తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కాయి. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తమిళిసై తొలిసారిగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలతో పాటు ఆర్టీసీ సమ్మెపై ఆమె ఓ నివేదిక అందజేశారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాను కలిసి తాజా పరిస్థితులను వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories