logo

డెంగ్యూ కేసులు..హైకోర్టు సీరియస్

డెంగ్యూ కేసులు..హైకోర్టు సీరియస్
Highlights

డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ విజృంభిస్తుండటంతో...

డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ విజృంభిస్తుండటంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మృతిచెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. మనుషులు చనిపోతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో ధర్మాసనం ముందుకు వచ్చి వివరించాలని పలువురు ఉన్నతాధికారులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్లు రేపు తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.


లైవ్ టీవి


Share it
Top