మాస్క్‌లు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై ఏలాంటి చర్యలు తీసుకున్నారు : తెలంగాణ హైకోర్టు

మాస్క్‌లు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై ఏలాంటి చర్యలు తీసుకున్నారు : తెలంగాణ హైకోర్టు
x
High Court
Highlights

చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ యువకుడు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం తెలంగాణ హై కోర్టులో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై విచారణ జరిగింది.

చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ యువకుడు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం తెలంగాణ హై కోర్టులో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కరోన వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటుందన్న విషయాలపై ప్రభుత్వం హై కోర్టుకు నివేదిక రూపంలో సమర్పించింది. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) మాట్లాడుతూ రేపటి నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడి చేసారు.

వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రుల్లో కూడా కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలంతా మాస్కులను వాడుతున్నారని, దాంతో మెడికల్ షాపుల వారు అధికధరలకు అమ్ముతున్నారని తెలిపారు. దాన్ని నియంత్రించేందుకు మాస్క్‌లు, శానిటైజర్లు అధిక ధరలకు అమ్మకుండా నిఘా పెట్టినట్లు కూడా చెప్పారు. వాటితో పాటుగానే జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులను రూపొందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో రోజుకు 500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌ హైకోర్టుకు చెప్పారు.

ఈ విశయాలన్నీ విన్న హైకోర్టు కేరళ చేపట్టిన చర్యల్లో అనుసరనీయమైనవి ఉన్నాయా అని ఏజీని ప్రశ్నించింది. ఇందుకు ఏజీ సమాధానం ఇస్తూ కేరళ చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు ఇక్కడి డాక్టర్ల బృందం వెల్లారని తెలిపారు. కాగా ఈ నెల 23వ తేదీ లోగా మరిన్ని వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసినట్లు హైకోర్టు ప్రకటించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories