కరోనా ఎఫెక్ట్ : తెలంగాణ హై కోర్టులో ఆంక్షలు

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణ హై కోర్టులో ఆంక్షలు
x
High Court
Highlights

కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గాను ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు న్యాయస్థానాలు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గాను ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు న్యాయస్థానాలు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోర్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు, ఇతర కోర్టుల బార్‌ అసోసియేషన్లను మూసేయాలని స్పష్టం చేసారు. హైకోర్టు, జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల విషయంలో హైకోర్టు రిజిస్టార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు అమల్లో ఉంటాయని ఈ సందర్భంగా వారు స్పష్టంచేశారు.

ఇందులో భాగంగానే కొద్ది రోజుల పాటు కోర్టు వారానికి మూడు రోజులు మాత్రమే పని చేస్తుందని తెలిపారు. కోర్టు పనిదినాలను ప్రతి సోమ, బుధ, శుక్రవారాలుగా నిర్ణయించారు. ఇక పోతే ఈ ఏడాది తెలుగు ప్రజలు జరుపుకును ఉగాది పండగ 25వ తేది బుధవారం వచ్చిన కారణంగా దానికి బుదులుగా కోర్టును 26వ తేదిన పనిచేస్తుందని తెలిపారు. హైకోర్టు సిబ్బందికి బయోమెట్రిక్‌ రద్దు చేశారు. వారంతా రిజిస్టర్లలో సంతకాలు పెట్టాలని తెలిపారు. జడ్జీల వద్ద పనిచేసే లా క్లర్కులు తిరిగి ఉత్తర్వులిచ్చే వరకూ విధులకు హాజరు కానవసరం లేదన్నారు. బార్‌ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల భోజనశాలల్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసారు.

ఇక ఈ పనిదినాల్లో అన్ని కేసులకు సంబంధించిన కక్షిదారులు రావలసిన అవసరం లేదని కేవలం కేసులు ఉన్న లాయర్‌లు మాత్రమే కోర్టుకు రావాలని తెలిపారు. కోర్టుకు హాజరయ్యే న్యాయవాదులు ముందుగా కోర్టు బయట ఏర్పాటు చేసే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కేసులను తేదీల పొడిగింపునకు లాయర్లు ప్రయత్నించాలన్నారు. ఎమర్జెన్సీ కేసులను మాత్రమే విచారిస్తాయని తెలిపారు. అన్ని రకాల పిటిషన్ల దాఖలుకు వీలుంటుందని స్పష్టం చేసారు. అత్యంత ముఖ్యమైన కేసులను మాత్రమే కోర్టులు విచారిస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories