డెంగీ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

డెంగీ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
x
Highlights

తెలంగాణలో డెంగీ విజృభిస్తోంది. హైదరాబాద్‌లో డెంగీ కేసులు రోజు రోజుకి అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులు కీటకీటలాడుతున్నారు.

తెలంగాణలో డెంగీ విజృభిస్తోంది. హైదరాబాద్‌లో డెంగీ కేసులు రోజు రోజుకి అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులు కీటకీటలాడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తున్న డెంగీ వ్యాధి నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని తెలంగాణ సర్కార్‌కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 1440 మంది డెంగీ బారిన పడినట్టు పత్రికల్లో చదివామని, రక్షణకు ఏం చర్యలు చేపట్టారో తెలియజేయండి అని పెర్కోంది. రాష్ట్ర ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ వ్యాఖ్యలు చేసింది. డెంగీ వ్యాధి నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుందో సెప్టెంబర్‌ 7లోగా సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

డెంగీ వ్యాప్తిపై డాక్టర్‌‌ కరుణ దాఖలు చేసిన పిల్​ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. హైదరాబాద్‌లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని, కొన్ని వేలాది విద్యార్థులు డెంగీతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. డెంగీ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు తాము కూడా నిత్యం వార్తల్లో చూస్తున్నామని.. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని..నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టంచేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories