హైకోర్టు ఆదేశాలతో ప్లాస్టిక్‌ పరిశ్రమలపై కొరడా

హైకోర్టు ఆదేశాలతో ప్లాస్టిక్‌ పరిశ్రమలపై కొరడా
x
Highlights

నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టుగా ఉన్న కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు.

నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టుగా ఉన్న కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు.నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్నారు. నగరంలోని కాటేదాన్‌, శాస్త్రి పురం తదితర ప్రాంతాల్లో ఉన్న 66 పరిశ్రమలను మూసివేశారు. ఒక్క సారిగా ఇన్ని పరిశ్రమలను మూసివేయడం సంచలనం కలిగించింది. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్నందుకు చర్యలు తీసుకోవలసి వచ్చిందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మూసివేసిన పరిశ్రమలన్నీ మూసీనదిని అనుకున్న ఉన్న ప్రాంతాల్లో అలాగే శాస్త్రిపురం, కాటేదాన్‌లతో పాటు, బహదూర్‌పురాల్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమల కారణంగా విపరీతంగా కాలుష్యం వెలువడి, పర్యావరణం పాడవుతుండడంతో గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగరంలో నమోదవుతున్న కాలుష్యం శాతంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ ప్రాంతం 57.73 స్కోర్‌తో పొల్యూటెడ్‌ ఏరియాగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ టెక్స్‌టైల్‌, ప్రింటింగ్‌, ఇడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీస్‌, ఆయిల్‌ రిక్లేమేషన్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ స్క్రాప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కంపెనీల కారణంగా కాలుష్యం వెలువడుతుందని వెల్లడైంది.

కాగా దీనిపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి కాలుష్య కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఏయే యూనిట్లనుంచి కాలుష్యం ఎక్కువగా అవుతుందో ఆయా యూనిట్లను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. తాజాగా పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌ రాకతో ఫైల్‌ ను ముందుకు నడిపి సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకున్నారు.

కాటేదాన్‌, శాస్త్రిపురం ప్రాంతాల్లోని 66 పరిశ్రమలు ఎలాంటి అనుమతులు పొందకుండానే ఏండ్లుగా నడుస్తున్నాయి. నిజానికి ఎవరైనా పరిశ్రమలను స్థాపించడానికి ముందుగా పర్యావరణ చట్టాల ప్రకారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు కాన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), ఉత్పత్తిని ప్రారంభించుకునేందుకు కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో)లను సెక్షన్‌ 25, 26 వాటర్‌ యాక్ట్‌ - 1974, సెక్షన్‌ 21 ఏయిర్‌ యాక్ట్‌ -1981 ప్రకారం పీసీబీ నుంచి పొంది ఉండాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories