ఆందోళన వద్దు.. రాష్ట్రంలో కరోనా ఎవరికీ సోకలేదు: మంత్రి ఈటల

ఆందోళన వద్దు.. రాష్ట్రంలో కరోనా ఎవరికీ సోకలేదు: మంత్రి ఈటల
x
Highlights

వారం రోజులగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోణా వైరస్ గురించి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడారు.

వారం రోజులగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోణా వైరస్ గురించి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడారు. బుధవారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో కరోనా వైరస్‌పై సమీక్ష తరువాత నిర్వహించన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వదంతులను నమ్మకూడదని తెలిపారు. ఇంతటి భయంకరమైన వైరస్ వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే థర్మల్‌స్క్రీనింగ్‌ చేస్తున్నామని తెలిపారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే వారికి సరైన పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌వార్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ ని నిర్ధారించే పరికరాలు రాష్ర్టంలో లేవని పరీక్షల కోసం ప్రతిసారి పుణెకు నమూనాలు పంపడం వల్ల కాలయాపన జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైరస్ నిర్ధారణకు కావాల్సిన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకైతే ఈ వైరస్ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్థారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల భరోసా ఇచ్చారు.

ఇక వచ్చే నెలలో జరిగే మేడారం జాతరలో కోటిన్నర మంది భక్తులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన తెలిపారు. జాతరకు వస్తున్న భక్తుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక అంబులెన్స్‌లు, మొబైల్‌అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటుగానే 6 మంది డీఎంహెచ్‌వోలతో పాటు ప్రత్యేక వైద్యాధికారులను నియమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories