Coronavirus‌: 'ఆ ఫ్లోర్‌కు ఇతరులు వెళ్లొద్దు': మంత్రి ఈటల రాజేందర్‌

Coronavirus‌: ఆ ఫ్లోర్‌కు ఇతరులు వెళ్లొద్దు: మంత్రి ఈటల రాజేందర్‌
x
Highlights

కరోనా బాధితుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఏడో ఫ్లోర్ లో ఐసోలేషన్ ప్రత్యేక వార్డును ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గాంధీ ఆస్పత్రిలో పర్యటించారు.

కరోనా బాధితుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఏడో ఫ్లోర్ లో ఐసోలేషన్ ప్రత్యేక వార్డును ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గాంధీ ఆస్పత్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వార్డు (ఏడో ఫ్లోర్‌)లో పలు మార్పులు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కరోనా సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాందీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో కరోనా బాధితులు తప్ప ఇతరులెవరూ వెళ్లకూడదని తెలిపారు. అందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షిస్తున్నారని కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారని తెలిపారు. అలా తరలించిన వారు ఎట్టి పరిస్థితిలోనూ 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అంతే కాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డును రెండు విభాగాలుగా చేయాలని అధికారులకు అదేశించారు. ఈ వార్డులో విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే ఒకచోట ఒక కార్డులో ఉంచాలని తెలిపారు. మరో వార్డులో కరోనా లక్షణాలు ఉన్న వారిని ఉంచాలని మంత్రి ఈటల స్పష్టం చేశారు. అంతే కాక ఏడో వార్డులో ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా మంత్రి ఆదేశాల మేరకు ఏడో ఫ్లోర్‌లో వైఫై సేవలు అం‍దుబాటులోకి తెచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories