రాష్ట్ర ప్రభుత్వంపై, వైద్యులపై విమర్శలు చేయడం సరికాదు : మంత్రి ఈటెల

రాష్ట్ర ప్రభుత్వంపై, వైద్యులపై విమర్శలు చేయడం సరికాదు : మంత్రి ఈటెల
x
Etela Rajender (File Photo)
Highlights

కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మొబైల్‌ కొవిడ్‌-19 ఐసీయూ వాహనాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు.

కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మొబైల్‌ కొవిడ్‌-19 ఐసీయూ వాహనాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మనే దేశంలో కరోనా ప్రభావంతో 3.5 శాతం మంది చనిపోతే అమెరికాలో 6 శాతం మంది చనిపోయారని మంత్రి పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారిలో 2.1 శాతం మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో 100 మందికి కరోనా టెస్టులు చేస్తే 6 మందికి మాత్రమే పాజిటివ్‌ వస్తుందన్నారు. కానీ కొంత మంది రాష్ట్ర ప్రభుత్వంపై, గాంధీ వైద్యులపై విమర్శలు చేస్తున్నారని అది సరికాదు అని మంత్రి అన్నారు. కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ కేసు వస్తే 14 రోజుల పాటు ఐసోలేషన్‌ చేయాలన్నారు. ఆ తరువాత మరోసారి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు ప్రతి సారి రోగికి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. నెగిటివ్ వచ్చిన వ్యక్తికి మరో 24 గంటల తర్వాత పరీక్షలు నిర్వహించాలన్నారు. అప్పుడు కూడా నెగిటివ్‌ వస్తే అతన్ని డిశ్చార్జి చేసి ఇంటికి పంపవచ్చునన్నారు.

కరోనాతో చనిపోయిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లనప్పుడు మున్సిపల్‌ సిబ్బందే దహన సంస్కారాలు చేసిందని గుర్తు చేశారు. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో కూడా కరోనా మృతుల దహన సంస్కారాలను అధికారులే చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులను 14 రోజులు హోం క్వారంటైన్‌కు పంపాలని చెప్పినట్లు మంత్రి గుర్తు చేశారు. ఆస్పత్రిలో చేరాక ఏడో రోజు వరకు లక్షణాలు లేకుండా పరీక్షలు అక్కర్లేదు అని కేంద్రం చెప్పిందని తెలిపారు. కరోనా సోకిన వారి ఇంట్లో అందరికీ పరీక్షలు చేయాలని చెప్పిందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories