గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మారుస్తాం : మంత్రి ఈటల

గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మారుస్తాం : మంత్రి ఈటల
x
Etela Rajendar (file photo)
Highlights

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని, ఇప్పటికే రెండో దశకు చేరుకుందని ఆయన అన్నారు. మూడో దశకు చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేరుకుంటే ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై అధికారులతో సమీక్షలో చర్చించారు.

రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మర్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి భోజనం, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో పనిచేసేవారు, ఆశావర్కర్లు, ఎక్కడివారు అక్కడే ఉండాలని తెలిపారు.

వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు ఇవ్వకూడదని ఆయన అన్నారు. చికిత్సకు కావాల్సిన పరికరాలు అన్నీ ఎప్పటికప్పుడు సమీకరించుకోవాలన్నారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఉంటే వారిని పూర్తిస్థాయిలో పరిశీలించాలని, 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో వారందరి వివరాలు తెలుసుకుని వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో ఇద్దరు ప్రైవేటు వైద్యులు ఉన్నారని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories