రికార్డు సాధించిన తెలంగాణ..

రికార్డు సాధించిన తెలంగాణ..
x
Highlights

అభివృద్ది దిశగా పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరోసారి రికార్డును సృష్టించింది. దేశ వ్యాప్తంగా మొక్కల పెంపకంలో రాష్ట్రం టాప్ లో నిలుచుంది.

అభివృద్ది దిశగా పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరోసారి రికార్డును సృష్టించింది. దేశ వ్యాప్తంగా మొక్కల పెంపకంలో రాష్ట్రం టాప్ లో నిలుచుంది. ఈ విషయాన్నిఅట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో, అదే విధంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాల్లో ఎన్నో మొక్కలను నాటారని తెలిపారు. కేంద్ర అటవీ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2017–18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటి జాతీయ స్థాయిలో తెలంగాణ మొదటి స్ధానంలో నిలుచుందని తెలిపారు. ఈ గణాంకాలను తాజాగా కేంద్ర అట‌వీ శాఖ వెల్లడి చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక పోతే ఒడిశా 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటి రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

ఇకపోతే 2016–17 సంవత్సరంలో 4,38,059 హెక్టార్లలో, 2015–16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటి మొదటి స్థానంలో నిలుచుంది. ఇక పోతే 2018–19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించిందని తెలిపారు. ఈ గణాంకాలన్నింటినీ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సమాధానంగా గణాంకాలను వెల్లడించా రు.

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మొక్కల పంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గానో కృషి చేసిందని ఈ నేపథ్యంలోనే ఇది సాధ్యమైందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని మొక్కలకు నాటి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని మంత్రి వెల్లడించారు. అంతే కాక ఈ నెలలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజున మొక్కను నాటి కానుకగా ఇద్దామని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories