Top
logo

200 మంది అధికారులను బదిలీ చేసిన : సీఎం కేసీఆర్

200 మంది అధికారులను బదిలీ చేసిన : సీఎం కేసీఆర్
Highlights

జంగిల్ బచావో-జంగిల్ బడావో నినాదంతో అడవుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చీఫ్...

జంగిల్ బచావో-జంగిల్ బడావో నినాదంతో అడవుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు సుమారు 200 మంది అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడవులు ఎక్కువగా ఉన్న చోట్ల నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఇందులో భాగంగానే అధికారుల బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి బదిలీల ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది అధికారులను అటవీశాఖ సస్పెండ్ చేసింది. అలాగే పలువురికి మెమోలు జారీ చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it