Top
logo

ఆకట్టుకున్న గవర్నర్ తమిళసై తెలుగు ప్రసంగం

ఆకట్టుకున్న గవర్నర్ తమిళసై తెలుగు ప్రసంగం
Highlights

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తమిళసై తెలుగులో మాట్లాడి అందరినీ అబ్బుర పరిచారు.


తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తమిళసై తెలుగులో మాట్లాడి అందరినీ అబ్బుర పరిచారు. గురువారం జలవిహార్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తెలుగులో మాట్లాడారు. తెలంగాణకు గవర్నర్ గా రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరకీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ చాలా బాగా నచ్చిందన్నారు. ఐదు రోజుల పాటు రాజ్‌భవన్‌లో బతుకమ్మ పండుగ నిర్వహించామన్నారు. తెలంగాణలో చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారన్న విషయాన్ని గ్రహింహామని తెలిపారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని బర్గర్లు, చిప్స్‌ లాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలని గవర్నర్‌ తమిళసై తల్లిదండ్రులకు సూచించారు.

Next Story