వనదేవతల జాతరకు సీఎం కేసీఆర్

వనదేవతల జాతరకు సీఎం కేసీఆర్
x
Highlights

వనదేవతల జనజాతర అంగరంగ వైభంగా జరుగుతుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టు పక్కన రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది...

వనదేవతల జనజాతర అంగరంగ వైభంగా జరుగుతుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టు పక్కన రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అమ్మవార్లను దర్శంచుకోవడానికి శుక్రవారం మేడారం జాతరకు రానున్నారు. ఈ సందర్భంగా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ములుగు జడ్పీ చైర్‌పర్సర్మన్ కుసుమ జగదీశ్ మేడారం జాతరకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని అమ్మవార్లకు ఎత్తుబంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, చీరెసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ శుక్రవారం ముఖ్యమంత్రి వచ్చేసమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆదేశించారు.

అనంతరం మేడారం జాతరకు సంబంధించింద ప్రత్యక్ష ప్రసారం చేసే విధంగా ఏర్పాటుచేసిన మీడియా పాయింట్ ను పరిశీలించారు. దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో మేడారం భక్తులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని, 24గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండాలని వైద్యులకు తెలిపారు.

ఇక పోతే ముఖ్య మంత్రి కేసీఆర్ మేడారం చేరుకోవడానికి గంట ముందే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించకున్నారు. వీరిద్దరూ కలిసి వెళ్లి గద్దెపై ఉన్న సమక్కను దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై సమ్మక్క సారలమ్మకు చీరలను సారిగా పెట్టి, బంగారాన్ని(బెళ్లం)ను ప్రసాదంగా నివేదించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories