ఆడబిడ్డలు మురిసేలా.. బతుకమ్మ చీరల తయారి

ఆడబిడ్డలు మురిసేలా.. బతుకమ్మ చీరల తయారి
x
Highlights

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలను ఇవ్వడం అనావయితీగా పెట్టుకుంది. అందులో భాగంగానే ప్రతి ఏడాది పండుగకు సుమారుగా 1.02 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తుంది.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలను ఇవ్వడం అనావయితీగా పెట్టుకుంది. అందులో భాగంగానే ప్రతి ఏడాది పండుగకు సుమారుగా 1.02 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తుంది. ఈ సారి కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి సిద్ధం అవుతుంది. కేవలం బతుకమ్మ పండగకే కాకుండా రంజాన్‌, క్రిస్మస్‌ పండగలకు కూడా చీరెలను ప్రభుత్వం అందజేస్తుంది.

ఈ కార్యక్రమం ద్వారా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టెక్కి అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నది. నేతన్నలకు కూడా ఉపాధికల్పిస్తున్నారు. ఈ కారణంగా ఎన్నో నేత కుటుంబాలు వారి బతుకులను బాగు చేసుకుంటున్నారు. నేతన్నలకు చేతినిండా పని, శ్రమకు తగ్గ వేతనం లభిస్తున్నది. ఇందులో భాగంగానే సిరిసిల్లలోని 18 వేల మరమగ్గాలు, 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించనున్నది. చీరెల నాణ్యతను పరిశీలించేందుకు చేనేత జౌళిశాఖ 50 మంది అధికారులను నియమించింది.

ఇక పోతే ప్రతి ఏడాది ఐదు నెలల ముందు చీరల తయారీకి ఆర్డర్లను ఇవ్వడంతో అనుకున్న లక్ష్యం పూర్తి కావడం లేదని అధికారులు తెలపడంతో. ఈ ఏడాది రూ.317 కోట్లతో 7 నెలల ముందునుంచే చీరల తయారీ కోసం ఆర్డర్లు ఇవ్వనుంది. దీంతో చీరెల తయారీలో నాణ్యతతోపాటు నిపుణత, సరికొత్త డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకొంటున్నది. అంతే కాదు యే ఏడాదికి ఆ ఏడాది రంగులు, డిజైన్లను మార్చుకుంటూ చీరలను తయారు చేస్తున్నారు.

అదే విధంగా ఈ సారి కూడా నిష్ణాతులతో ఆకర్షణీయమైన డిజైన్లు, అందమైన రంగుల్లో తయారుచేయిస్తున్నది. ఈసారి గుజరాత్‌ నుంచి నూలును తెప్పించింది. చెక్స్‌, లైనింగ్‌, ప్లెయిన్‌ చీరెలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ కోటి చీరల్లో 6.30 మీటర్ల పొడవైనవి 90 లక్షలు, 9 మీటర్ల పొడవైనవి 10 లక్షలు తయారుకానున్నాయి.

మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరువతో తెలంగాణతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కార్మి కులకు ఈ సారి పనికల్పిస్తున్నారు. రేపియర్‌ మరమగ్గాలపై చెక్స్‌, లైనింగ్‌, వివిధరకాల డిజైన్లను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories