తెలంగాణలో రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ.. మే 2 నుంచి రూ. 1500

తెలంగాణలో రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ.. మే 2 నుంచి రూ. 1500
x
KCR (File Photo)
Highlights

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే..

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుపై రూ. 1500 ఆర్థిక సహాయన్ని గత నెలలో అందించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇదే పద్ధతిని ఈ నెల కూడా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే..

శుక్రవారం (మే02) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లుగా పేర్కొంది. ఇక ప్రతి ఒక్క ఆహార భద్రత కార్డుదారునికి రూ. 1500 వారి బ్యాంకు లేదా పోస్టాఫీసు అకౌంట్ లో జమ చేసే కార్యక్రమాన్ని మే 1న బ్యాంకులకు సెలవు కావున 2వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు లభ్దిదారులకు పౌరసరఫరాల శాఖ పలు సూచనలు చేసింది. రేషన్ లబ్ధిదారులు కచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని.టోకెన్లో ఇచ్చిన సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని వెల్లడించింది. అంతేకాకుండా తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రతి రేషన్ షాపు వద్ద సబ్బు, సానిటైజర్, నీళ్లు వంటి కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకొవాలని వెల్లడించింది. ఏప్రిల్ నెల లాగే మే నెలలో కూడా 23వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories