తెలంగాణ రైతులకు శుభవార్త... రుణ మాఫీ నిధుల విడుదల

తెలంగాణ రైతులకు శుభవార్త... రుణ మాఫీ నిధుల విడుదల
x
Highlights

ప్రతి నిత్యం రైతుల సంక్షేమం గురించి ఆలోచించే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు శభవార్త తెలిపింది.

ప్రతి నిత్యం రైతుల సంక్షేమం గురించి ఆలోచించే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు శభవార్త తెలిపింది.ఆరుగాలం కష్టించి ప్రజలకు బువ్వపెట్టే రైతన్నల రుణాలను మాఫీ చేయానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. పంటవేసే సమయంలో రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప ఆలోచనను చేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ రూ.25 వేలలోపు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆద్వర్యంలో రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నిధుల విషయమై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిలు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రూ.25 వేలు నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలకు నాలుగు విడతలుగా చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. రూ. 25 వేల లోపు రైతు రుణాలను ఒకే సారి మాఫీ చేసేందుకు గాను రూ.1200 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

ఈ నిధులను 6.10 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కోటీ 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించామని మంత్రి హరీష్‌ రావు ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే వానాకాల పంటకు రైతుబంధు పథకం కోసం రూ.7 కోట్లు విడుదల చేసారు.

మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం మొదలయి రైతులు పంటలను సాగు చేయనున్నారని, ఆ సమయంలో వారి చేతుల్లో పెట్టుబడికి డబ్బులు ఉండాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. సీఎం కేసిఆర్‌ కేబినెట్‌లో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ. 7 వేల కోట్లను పంట సీజన్‌ ప్రారంభం నాటికే రైతులకు అందిస్తామని మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేసారు. ఆర్థిక, వ్యవసాయ శాఖలతో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆరు లక్షల పది వేల మంది రైతులకు లబ్ది చేకూరనుందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories