జీవోను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు...

జీవోను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు...
x
తెలంగాణ సీఎం కేసీఆర్
Highlights

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం మే 7వ తేది వరకు లాక్ డౌన్ ను పొడగించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఎంతో...

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం మే 7వ తేది వరకు లాక్ డౌన్ ను పొడగించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఎంతో మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగానే వచ్చే విద్యాసంవత్సరం ప్రయివేటు పాఠశాలలు ఫీజులను నియంత్రించాలని, కేవలం నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని జీవో నెం.46ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో నిన్న సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఆదేవాలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు.

ఈ జీవోకు సంబంధించి ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ తో కలుపుకుని అన్ని ప్రయివేటు పాఠశాలలకు జీవో వర్తిస్తుందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ విధంగా ఫీజులు పెంచకపోవడం వలన మధ్యతరగతి, పేద కుటుంబాలను కాస్త ఊరట కలుగుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories